ఏపీలోని వేలాది దేవాలయాల సమీపంలో స్టాళ్ళ ద్వారా భక్తులకు కావాల్సిన కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, అరటిపళ్ళు విక్రయిస్తూ వుంటారు. అయితే రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీలో దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను నియంత్రించేలా దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీచేశారు. దేవాలయ ప్రాంగణంలోని లైసెన్స్ కలిగిన షాపుల్లో ఎమ్మార్పీ…