Moinabad Farmhouse : ఇటీవల హైదారాబాద్ నగర శివారు మొయినాబాద్ పరిధిలోని తొల్కట్టలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లతో పాటు పందెం కోళ్లను పట్టుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఈ రోజు మొయినాబాద్ తోల్కట్ట ఫామ్ హౌస్ కేసులో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు వేలం వేశారు. అయితే.. రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో పందెం కోళ్లకు వేలం నిర్వహిస్తున్నారు…
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. పందాల్లో గెలిచిన ఓడిన కోడిపుంజుకున్నా డిమాండే వేరు. ఓడిపోయిన కోడి కోస మాంసం తినడానికి ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. డ్రై ఫ్రూట్స్ మేతగా వేసి కోడిపుంజులను పెంచుతారు.. గనుక వీటి మాంసం టేస్టే వేరు.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లుకు కోస టేస్ట్ కు లొట్టలేస్తారు.
పండగ వేళ పల్లెలు.. కిక్కిరిసిన జనంతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి... ఇక కోడి పందేల్లో కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు కత్తికట్టి కాలు దువ్వుతున్నాయి. వీటి హవానే ఇన్నేళ్ల నుంచీ పందేల్లో కొనసాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హవా నడుస్తోందని చెబుతున్నారు పందేం రాయుళ్లు. ఇక ఒక్కో పందెం వేల నుంచి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోయింది.
తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా…
పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది.…
జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం…