కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పర్యటించారు. సుల్తాన్‌పూర్ సివిల్ కోర్టు నుండి లక్నోకు వెళుతుండగా.. రాహుల్ గాంధీ కాన్వాయ్ గుప్తర్‌గంజ్‌లోని ఎమ్మెల్యే నగర్‌లోని ఓ చెప్పుల కొట్టు వద్ద ఆగారు. రాహుల్ గాంధీ ఆ కొట్టులో కూర్చుని చెప్పులు కుడుతున్న వ్యక్తితో మాట్లాడారు.