బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
Pakistan Boat: పాక్ ఫిషింగ్ బోటులో భారీగా ఆయుధాలను గుర్తించి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆయుధాలు, 10 మంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్థాన్ ఫిషింగ్ బోటును భారత జలాల్లో కోస్ట్ గార్డ్ అధికారులు అడ్డుకున్నారు.
కేరళలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొచ్చిన్ కోస్ట్ గార్డ్ లక్షద్వీప్ దీవులలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రూ.1,526 కోట్ల విలువ చేసే 218 కేజీల హెరాయిన్ సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేటుగాళ్లు విదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు లక్షద్వీప్ దీవులలో అధికారుల బృందం మాటు వేసింది. 12 రోజుల నిరీక్షణ తరువాత రెండు బోట్లలో తరలిస్తున్న డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు…