Pakistan Boat: భారీగా ఆయుధాలతో పాక్ ఫిషింగ్ బోటు.. అడ్డుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Boat: పాక్ ఫిషింగ్ బోటులో భారీగా ఆయుధాలను గుర్తించి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆయుధాలు, 10 మంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్థాన్ ఫిషింగ్ బోటును భారత జలాల్లో కోస్ట్ గార్డ్ అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్‌లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది.
Read Also: Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ
Also Read
పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ భారతదేశంలో ప్రధాన సమస్యగా మారింది. వీటిని అరికట్టేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్ (హెచ్ హెచ్ టీఐ), నైట్ విజన్ డివైస్ (ఎన్ వీడీ), ట్విన్ టెలిస్కోప్, అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫోర్స్ మల్టిప్లైయర్‌ల మార్గాలుగా ఉపయోగిస్తున్నారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తెలియజేసింది. అంతేకాకుండా సీపీటీవీ, పీటీజెడ్ కెమెరాలు, ఐఆర్ సెన్సార్లతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ అలారంలతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ టెక్నాలజీని అంతర్జాతీయ సరిహద్దులోని ఎంపిక చేసిన ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు రానున్న రోజుల్లో 5,500 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా చేయనున్నట్లు చెప్పారు.
@IndiaCoastGuard in joint ops with ATS #Gujarat, apprehended #Pakistani Fishing Boat Al Soheli with 10 crew in Indian waters. During rummaging Arms, ammunition & approx 40 Kgs #narcotics worth Rs 300 cr found concealed. Boat being brought to #Okha for further investigation. pic.twitter.com/3YwzKne6bQ
— Indian Coast Guard (@IndiaCoastGuard) December 26, 2022
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!