గత వారం కోల్‌కతాలో ఐ-ప్యాక్ కార్యాలయంపై ఈడీ ఊహించని రీతిలో దాడి చేసింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల వార్తలు వినగానే వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలికి చేరుకుని అడ్డుకున్నారు. కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Mamata Banerjee: కోల్‌కతాలో ఐ-ప్యాక్ ఆఫీస్, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ దాడులు సంచలనంగా మారాయి. దాడులు జరుగుతున్న సమయంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ )అధినేత్రి అక్కడి రావడం, ఆఫీసు నుంచి ఫైళ్లను తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. భూపేశ్ బాఘేల్ తో పాటు, సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
CBI Raids Bengal Law Minister In Coal Scam Case: మరో పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసాలు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) అధికారులు దాడులు చేశారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్న మోలోయ్ ఘటక్ మూడు ఇళ్లపై, కార్యాలయాతో పాటు మొత్తం ఏడు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. అసన్‌సోల్, కోల్‌కతా సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల…