తెలంగాణలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఈ నెల 25న ఆషాడమాసం బోనాలు నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సంవత్సరం కరోనా కారణంగా బోనాలు నిర్వహించలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఘనంగా ఆషాడ బోనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది తెలంగాణ సర్కార్. అటు జులై 11 న గోల్కొండ బోనాలు నిర్వహించాలని.. 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అటు ఆగస్టు 1 వ తేదీన హైదరాబాద్ బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. కాగా… ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ముందు ఈ బోనాల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.