Vizianagaram Train Accident: కీలక ప్రశ్నలు లేవనెత్తిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizianagaram Train Accident: విజనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై సోషల్ మీడియా వేదికగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విజయనగరం వెళ్లి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన.. వారికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు.. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇక, విజయనగరం పర్యటనకు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో పంచుకుంటూ ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఆ తర్వాత పలు కీలక ప్రశ్నలను లేవనెత్తుతూ మరో ట్వీట్ చేశారు..
తొలి ట్వీట్‌లో.. ”విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను” అంటూ తొలి ట్వీట్ చేశారు సీఎం వైఎస్ జగన్.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఇక, విజయనగరం రైలు ఘటన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు సీఎం జగన్.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రికి అభ్యర్థించారు సీఎం జగన్.. ‘నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.. రన్నింగ్‌లో ఉన్న రైలు మరో రైలును ఢీ కొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.. 1. బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు?.. 2. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది?.. 3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విధ్వంసకర ప్రమాదాలు జరగకుండా దేశ వ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన మంత్రి, రైల్వే మంత్రిలను అభ్యర్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain.
A running train collided with another stationed train, both of which were running in the same direction.
This horrifying accident gives rise to certain obvious questions:…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!