పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు ప్రకాశం జిల్లాలోని తన నియోజకవర్గం మార్కాపురంలో తర్లపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి.. తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.. ఇక ఊర్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ.. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు.