KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది.. అది కాస్తా వైరల్‌గా మారిపోతుంది.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది.. ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధుల కలసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.. అక్కడి వరకు బాగానే ఉంది.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు కేఏ పాల్.. సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పాల్‌ను.. అనుమతి లేదని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు పోలీసులు.. ఇక, పోలీసులు అడ్డుకోవడంతో సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద వేచి చూస్తున్నారు..
Read Also: Lalit Modi: ఆర్‌సీబీ తరఫున ఆడకుంటే.. కెరీర్ ముగించేస్తానని మోడీ బెదిరించాడు: టీమిండియా మాజీ పేసర్
ఇక, ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చినట్టు వెల్లడించారు.. అంతేకాదు.. సీఎం వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ ఈ రోజంతా వేచి చూస్తానన్నారు.. అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తాను అని వ్యాఖ్యానించారు కేఏ పాల్. కాగా, అంతకుముందు ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను అన్నారు.. అంతేకాదు.. పోలింగ్ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం అన్నారు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు పాల్.. కాపులందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు.. పవన్ కల్యాణ్‌కి నా పర్సనల్ రిక్వెస్ట్.. వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు అని సూచించారు కేఏ పాల్.