ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఎంపీ పదవితో పాటు.. జిల్లా అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. ఈ మేరకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించిన తరునంలో.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు..