నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే 'సిద్ధం' బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
విద్యారంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వ అధికారులు, ఎడ్‌క్స్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అన్నారు
విశాఖ రాజధానిగా కావాలన్నదే మా ఆకాంక్ష.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు..
ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు.
నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి .. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్‌సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పలు పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొత్తంగా రాష్ట్రంలో రూ.4,178 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పలు పరిశ్రమలకు భూమి పూజ ఈ రోజు నిర్వహించనున్నారు..