ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రమాదం పొంచిఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది.. దీంతో.. సీఎం కోసం రెండు హెలీకాప్టర్లు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.. సీఎం జగన్ పర్యటనల నిమిత్తం రెండు ప్రత్యేక హెలీకాప్టర్లను రెడీ చేస్తున్నారు.. విజయవాడ, విశాఖల్లో రెండు హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం