జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఎంపీ వంగా గీతకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు నేపథ్యం ఇన్‌ఛార్జ్ వంగా గీత హుటాహుటిన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.
లివెందుల టీడీపీ నేత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీసీ భవనంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Jagananna Vidya Deevena Funds Released: శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు…
పవన్‌కల్యాణ్ తాడేపల్లిగూడెం సభలో మాట్లాడిన మాటలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌లా పవన్.. జగన్ దగ్గర అవ్వన్నీ నడవవన్నారు. యుద్ధం అంటున్నావ్ పవన్ ...2014, 2019లో ఏమి చేసావు.. జగన్ నీకు పెద్ద సినిమా చూపించాడన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది అధికార వైఎస్సార్‌సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌ను కలిసి ఏమైనా కావాలి అని అడిగితే బాలినేని అలిగాడు అంటారని.. ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.