ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే రాజీనామాకి కారణం కాదు అని స్పష్టం చేశారు వాసిరెడ్డి పద్మ.. పోటీ చేయడమే గీటు రాయి కాదు.. అలా అని కొందరు అనుకుంటూ ఉండచ్చు అన్నారు. బలా బలాల కారణంగా ఏమైనా అవకాశం ఉండకపోవచ్చు.. నాకు సీటొచ్చిందా లేదా అనేది ప్రాధాన్యత కాదు.. పార్టీ ఆదేశించినా ఆదేశించకపోయినా అన్నిటికీ సిద్ధమే అన్నారు వాసిరెడ్డి పద్మ..
ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనకాపల్లి సభలో బటన్ నొక్కి మహిళల ఖాతాలో 18 వేల 750 చొప్పున జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున.. వారి ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం విదితమే..
ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.