కరోనా కష్టకాలం కనీసం మానవత్వాన్ని చూపకుండా.. అందినకాడికి దండుకునే దందా కొనసాగిస్తున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. తప్పిదాలకు పాల్పడిన ప్రైవేట్ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. ఇప్పటికే నిబంధనలు పాటించని చాలా ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం.. ఫైన్లు కూడా వేశామన్నారు.. కోవిడ్ పేషంట్ల నుంచి ఎక్కువ డబ్బులు…
యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం…
అనందయ్య విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల సంఖ్యను దాచిపెట్టడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బులిటెన్ ప్రకారం 13 మంది చనిపోయినట్లు చూపించారు.. అదేరోజు జిల్లాలో 200 మందికి పైగా కోవిడ్ తో చనిపోయారని ఆరోపించారు.. ప్రస్తుతం ప్రజలు కరోనా గురించి భయపడటం లేదన్న ఆయన.. అమెరికాలో కరోనాతో చనిపోయిన…
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పనులను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… కడప జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డిగారిపల్లెలో వైస్సార్ జగనన్న కాలనీని సందర్శించిన ఆయన.. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు.. వాటితో పాటు త్వరితగతిన ఇసుక డంప్ ను ఏర్పాటు చేయాలన్న ఆయన.. యుద్ధప్రాతిపదికన…
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా వ్యాక్సినేషన్‌పై పడిపోయారు.. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లతో పాటు.. రాష్ట్రాలు కూడా గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలుచేస్తున్న సంగతి తెలిసిందే… ఇక, ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది.. 11,45, 540 కోవిషీల్డ్ డోసులకు గాను రూ.36,08,45,100 చెల్లించింది.. కోవిషీల్డ్ ఒక డోస్ ధర రూ 300 కాగా.. దానికి 5 శాతం ట్యాక్స్ కలుపుకుని రూ.315గా అవుతుంది.. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయాలను తీసుకుంది. అగ్రకులాల కోసం సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది వైసీపీ సర్కార్… రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు.. కమ్మ కులస్తులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.. రెడ్డి కులస్తులు, క్షత్రియుల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను నెలకొల్పింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ మూడు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేయనున్నాయి.. ఆయా వర్గాల్లో ఆర్థికంగా…
తెలుగు దేశం పార్టీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.. మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోన్న టీడీపీ.. సురభి డ్రామా కంపెనీని గుర్తు చేస్తుందని కామెంట్ చేసిన ఆయన.. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని.. ఎస్వీఆర్, నాగభూషణం వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారు.. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రుడి బడ్జెట్ పిట్టల రాయుడి బడ్జెట్.. ఇది కూతల బడ్జెట్, కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. మొదటి , రెండవ బడ్జెట్ లో కూతలు పెట్టిన ఈ ప్రభుత్వం.. మూడవ బడ్జెట్ లో ఎంతో కోత పెడుతోందన్నారు.. వ్యవసాయం , సాగునీటి రంగం, వైద్య , హౌసింగ్ రంగాలకు కేటాయించిన దానికంటే ఖర్చు…
కరోనా నివారణ చర్యల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది.. ప్రభుత్వాలకు ఇది భారంగా కూడా మారుతోంది.. అయితే, కరోనా కట్టడి చర్యలకు సాయం అందించడానికి మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నాయి పలు సంస్థలు.. తాజాగా, కియా మోటార్స్ తన వంతు సాయం ప్రకటించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్‌టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసిన పత్రాలను అందజేశారు కియా ప్రతినిధులు. ఈ నిధులను…
కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథలైతే ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనుండగా.. అల్పాదాయ…