కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథలైతే ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనుండగా.. అల్పాదాయ వర్గాల కుటుంబాల పిల్లలకే వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు
ఇక, ఎక్స్ గ్రేషియాగా ఇచ్చే రూ. 10 లక్షలను అనాథ పిల్లల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం… దానికి సంబంధించిన బాంబును పిల్లలకు అందచేయాలని సూచిచింది.. ఆ చిన్నారులు 25 ఏళ్లు నిండిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు తీసుకునేలా ఏర్పాట్టు చేస్తున్నారు. అయితే, ఎఫ్‌డీపై వచ్చే వడ్డీని ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి వివియోగించుకునేలా నిబంధనలు రూపొందించారు.. మరోవైపు, కరోనా బారినపడి తల్లిదండ్రులను కొల్పోయిన అనాథ పిల్లలను గుర్తించడానికి జిల్లా స్థాయిలో కమిటీ వేయనున్నారు.. కలెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ పనిచేయనుంది.