మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కవిత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశానని, క్రైస్తవ సోదరులకు బీఆర్ఎస్ పార్టీకి పేగు సంబంధం ఉందన్నారు కవిత. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని, మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు…
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనలో భాగంగా ముందుగా ఏడుపాయల అమ్మావారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ క్యాథెడ్రల్ చర్చికి చేరుకున్నారు.
CM Revath Reddy: మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడు పాయల అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించారు. ఇవాళ ఉదయం హెలికాప్టర్ లో సీఎం మెదక్ చేరుకున్నారు.
అల్లు అర్జున్ ఎపిసోడ్లో పార్టీ నాయకులు.. గప్చుప్గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పుష్ప సినిమా వ్యవహారంలో ప్రభుత్వం.. పోలీసులు చూసుకుంటారని దానిపై రాజకీయ నాయకుల కామెంట్స్ అవసరం లేదని హెచ్చరించారు. అనవసరంగా నాయకులు ఎదురుదాడి చేస్తే తలనొప్పి వస్తుందని ముందే గ్రహించిన సీఎం రేవంత్రెడ్డి...పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
Medak Tour: నేడు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. ఇవాళ వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
అదానీ పెట్టుబడులను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. గత సంవత్సరం ఆగష్టు సెప్టెంబర్ నెలలో సమ్మెకు దిగారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న తమరు వారికి సంఘీభావం తెలిపి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా…
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు.
మెదక్ జిల్లాలో రేపు (బుధవారం) పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. రేపు వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.