నేడు కర్ణాటకలో కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీ..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది. అలాగే, ఈ నెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం దగ్గర రాజ్యాంగ సంస్థలను బీజేపీ- ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకోవడంపై హస్తం పార్టీ తన వాదనలకు పదును పెట్టనుంది. ఈ రెండు ర్యాలీల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లతో పాటు పార్టీ అగ్రనాయకత్వం పాల్గొంటారు. డిసెంబర్ 27న బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మరుసటి రోజున ప్రతిపాదించిన ర్యాలీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం కారణంగా వాయిదా పడింది. దాదాపు 25 రోజుల తర్వాత మళ్లీ బెళగావిలో ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ ర్యాలీలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ యొక్క లోతైన సవాళ్లను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం లేవనెత్తుతుంది. అలాగే, బీజేపీ- ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ఉనికిని సవాలు చేసే ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది.
‘జాంబిరెడ్డి’ సీక్వెల్ పై వైరల్ అప్ డేట్
చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన సినిమాలో ‘జాంబిరెడ్డి’ ఒకటి.టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ ని సోంతం చేసుకుంది. ప్రేక్షకులకు పరిచయం లేని ఒక కొత్త సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో జాంబీస్ అనే పదం ప్రేక్షకులలో బాగా ఉండిపోయింది. కమెడితో పాటు, భయం, డివోషనల్ అని కలిపి చూపించాడు ప్రశాంత్.ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందనే విషయం తెలిసిందే.
ఆంధ్రాలో అఖండ -2 షూటింగ్.. ఎక్కడంటే..?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకరకంగా చెప్పాలంటే అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. తాజాగా అఖండ -2 షూటింగ్ ను ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జరుగుతున్న కుంభమేళాలో షూటింగ్ చేసాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేసాడు. ఈ షూటింగ్ లో సీనియర్ నటి శోభన తదితరులు పాల్గొన్నారు. కుంభమేళా షూటింగ్ ఫినిష్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పడు ఏపీలో లొకేషన్స్ వేట సాగిస్తున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం గుడిమెట్ల పరిసర ప్రాంతాలను బోయపాటి పరిశీలించాడు.
ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుతను చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీ సిబ్బంది వెంటనే పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మహాకుంభ మేళాలో పాల్గొననున్న గౌతమ్ అదానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) మహాకుంభ మేళాలో (Maha Kumbh Mela) పుణ్యస్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఇస్కాన్ శిబిరానికి చేరుకుని భక్తులకు సేవలందించనున్నారు. అదానీ బంద్వాలో హనుమాన్ (Hanuman) ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇస్కాన్ (ISKCON) సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. గౌతమ్ అదానీ మహాకుంభ మేళ ప్రాంతంలో సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అదానీ గ్రూప్ ప్రతిరోజూ లక్ష మందికి ఉచిత మహాప్రసాదాన్ని (free meals) పంపిణీ చేస్తోంది. ఈ భోజనంలో రోటీలు, పప్పు, అన్నం, కూరగాయలు, మిఠాయిలు తదితర భోజనాలను భక్తులకు అందిస్తున్నారు. డిఎస్‌ఎ గ్రౌండ్ సమీపంలో భారీ వంటగదిని ఏర్పాటు చేసి, ప్రతిరోజూ లక్ష మందికి పైగా భోజనం తయారు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల కోసం అదానీ గ్రూప్ గోల్ఫ్ కార్ట్స్ ల సౌకర్యాన్ని కల్పించింది. ఈ బ్యాటరీతో నడిచే వాహనాల ద్వారా వారు సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. భక్తుల ప్రయాణం సులభతరం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రెండో రోజు దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో (WEF) పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పావిలియన్‌ను ప్రారంభించారు. ఈరోజు ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్న దావోస్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం వివిధ దేశాల ప్రముఖులతో పాటు ఇండియాకు చెందిన గౌరవ అతిథులతో భేటీ అయ్యింది. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య ప్రసంగం చేస్తూ, తెలంగాణలో పారిశ్రామిక వృద్ధిని హైలైట్ చేశారు. బయోటెక్నాలజీ, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.
మై ‘డియర్ ఫ్రెండ్’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోడీ విషెస్
వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో జరిగిన కార్యక్రమంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నా ప్రియ మిత్రుడు ట్రంప్‌నకు అభినందనలు.. భారత్- అమెరికా దేశాల మధ్య ప్రయోజనాలు, ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడం కోసం మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను అంటూ పేర్కొన్నారు. మీ పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
వేలంలో పంజాబ్ తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డా: పంత్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను దక్కించుకున్న లక్నో.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ మాట్లాడుతూ.. వేలంలో పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డా అని సరదాగా అన్నారు.
‘వేలం రోజు నేను కాస్త టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్‌కు కారణం పంజాబ్ కింగ్స్. పంజాబ్ వద్ద అత్యధిక పర్సు మనీ ఉంది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ దక్కించుకోవడంతో నేను లక్నో టీమ్‌లో చేరగలనని అనుకున్నాను. లక్నోలో చేరేందుకు అవకాశం ఉంది కానీ.. చివరికి వేలంలో ఏం జరుగుతుందో తెలీదు కదా. దీంతో కాస్త టెన్షన్ పడ్డాను. భారీ ధర దక్కించున్నందుకు ఒత్తిడి ఏమీ లేదు. సంజీవ్ గోయెంకా ఆందోళన చెందనంత కాలం నాకు ఎలాంటి సమస్య లేదు. డబ్బు సంపాదించడం మంచిదే కానీ.. ప్రతి రోజు దాని గురించే ఆలోచించకూడదు’ అని రిషబ్ పంత్ తెలిపాడు.
బడా నిర్మాతల ఇల్లు, ఆఫీసులో ఐటి అధికారుల దాడులు
హైదరాబాద్ లో తెల్లవారుజాము నుండి ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 200 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. ఇటీవల సంక్రాంతికి విడుదలైన రెండు స్టార్ హీరోల సినిమాలు నిర్మించిన సినీ నిర్మాత నివాసంతో పాటు, ఆఫీసు, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రముఖ ఆ నిర్మాత సోదరుడు, కుమార్తె నివాసంలో కూడా ఐటీ సోదాలు చేస్తున్నారు అధికారులు. మరోవైపు గతేడాది చివర్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి ఇండియా బిగ్గెస్ట్ హిట్ సాధించిన చిత్ర నిర్మాత ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణ సంస్థల్లో కీలకమైన ముగ్గురు ఇళ్లలోను ఐటి అధికారులు ఈ తెల్లవారు జామున నుండి సోదాలు చేస్తున్నారు.
నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయబోయే నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గతంలో అందిన దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ సర్వే బృందాలు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించి, అర్హుల జాబితాను రూపొందించి సంబంధిత అధికారులకు అందించారు. ఈ జాబితాలను గ్రామ, వార్డు స్థాయి సభల్లో బహిరంగంగా చదవనున్నారు. జాబితాలో ఉన్న పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఆయా అభ్యంతరాలను స్వీకరించేందుకు ఇంచార్జి అధికారులను నియమించారు. ఎంపీడీఓ ఆధ్వర్యంలో విలేజ్ సెక్రటరీ, ఆర్‌ఐ, ఏఈవో, ఏవోలు టీంలు గ్రామ స్థాయిలో పనిచేస్తూ అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులను స్వీకరిస్తాయి. ఈ నెల 26 నాటికి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసి, గ్రామసభల్లో ఆమోదించబడుతుంది.
VD 12 : విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా రిలీజ్ డేట్ ఇదే ..?