సిద్ధిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్లో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ..…
Tammareddy: సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత అవసరమని ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. చిత్రపరిశ్రమలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఆయన మీడియాతో ముచ్చటించారు.
KTR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మన్మోహన్ లాంటి మహానుభావుడిని కోల్పోవడం దేశానికి తీరని లోటని అన్నారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ…
మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో 26 డిసెంబర్ రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Sandhya Theatre Incident : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే.
నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ…
Telangana Govt: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నాటకలోని బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో.. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లకు దక్కింది.