తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ని మార్చబోతున్నారన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా మార్పు మాట వినిపిస్తున్నా... అంత కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ... ఇప్పుడు మాత్రం మేటర్ వేరుగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తర్వాత పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అధిష్టానం.
న్యూ ఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కార్, కాల్పులు.. 10 మందికి పైగా మృతి..! అమెరికాలో న్యూ ఓర్లీన్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల…
CM Revanth Reddy : తనకు కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే, మంత్రులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. నేను మారిన… మీరు మారండని, ఇవాళ అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పని తీరు… ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్ట్ లు నా దగ్గర ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా అని, అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా అని ఆయన…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేవంత్ కోరినట్టు టీటీడీ దర్శనాల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.. సోమవారం నుంచి గురువారం వరకు రెండు బ్రేక్ దర్శనం కోసం, రెండు ప్రత్యేక దర్శనం కోసం సిఫార్సు లేఖలను అనుమతి ఇస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
కాంగ్రెస్ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అనేక ప్రభుత్వాల్లో.. శాఖల్లో పని చేసిన సమయంలో జిల్లా ఆభివృద్ధి ధ్యేయంగా పని చేశానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్న పరిష్కరించానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారన్నారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో…
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలని తెలిపారు. మంచి ప్రదేశంలో మన్మోహన్ సింగ్ విగ్రహం పెడతామని సీఎం పేర్కొన్నారు.
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.