బీజేపీలో చేరిన మేయర్, కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు
కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. నీ భాగోతం బయట పెడుతా అన్నారు. కమిషన్లు ముడితే చాలు.. ఆ తర్వాత గంగుల కనిపించడని ఆరోపించారు. కరీంనగర్ లో జరిగిన ప్రతీ కుంభకోణం వెనక గంగుల పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.
దావోస్ టూర్ వివరాలు వెల్లడించిన చంద్రబాబు.. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ..
సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు.. గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం అన్నారు.. దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు. ఏఐ.. డీప్ టెక్‌కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది అన్నారు చంద్రబాబు.. మిలింద గేట్ ఫౌండేషన్ తో హెల్త్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని బిల్ గేట్స్ చెప్పారన్నారు చంద్రబాబు.. దేశానికి మోడల్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు.. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు.. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో భవిష్యత్ లో తెలుగు వారుంటారు.. గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను త్వరలో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం.. దీనికి సంబంధించి మేనేజ్ మెంట్ కంపెనీ ఉంటుందన్నారు.. అందరు పారిశ్రామిక వేత్తలు జీఎల్‌సీలో ఉంటారు… సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారు చేయడమే లక్ష్యం.. కార్పోరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో సవాళ్లు ఎదుర్కొనే విధంగా తయారు చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.
రేపు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తాం..
అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరని తెలిపారు. “వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తాం. ఉపాధి హామీలో నమోదై, కనీసం ఇరవై రోజులు పని చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తాం. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం నాలుగు పథకాలపై సమీక్ష చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జనవరి 26న ఇస్తామని ప్రకటించాము. గ్రామ సభలు నిర్వహించి, అర్హత కలిగిన లబ్ధిదారులకు అందరికి ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. ఇండ్లు, రేషన్ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. జనవరి 26 పరమ పవిత్రమైన రోజు… భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం లాంఛనంగా పథకాలు ప్రారంభిస్తాం. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఈ 4 పధకాలు ఇస్తాం.” అని భట్టి విక్రమార్క తెలిపారు.
హైడ్రా చర్యలకు హర్షం వ్యక్తం చేసిన దివ్యానగర్ వాసులు.. ఎందుకంటే?
హైడ్రా చర్యలకు దివ్యానగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కూల్చివేతలుపై హైడ్రాను స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీతో హైడ్రా కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. “20 ఏళ్లుగా నల్ల మల్లారెడ్డి అరాచకాలు ఎదురుకుంటున్నాం.. దివ్యా నగర్ లే ఔట్ చుట్టూ గోడను నిర్మించి చుట్టుపక్కల కాలనీ వాసులకు ఇబ్బంది పెట్టాడు.. మా ప్లాట్లు అమ్ముకోవాలన్నా నల్ల మల్లా రెడ్డి చెప్పిన ధరకే అమ్మాలి.. దివ్యా నగర్ లో కేవలం నల్ల మల్లారెడ్డి ఐడి కార్డు ఉన్న రియల్టర్లు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. మిగతా ఏ రియల్టర్ల కు అనుమతి ఉండదు.. డెవలప్మెంట్ లో కొందరి ప్లాట్లు కనిపించకుండా పోయాయి.. వాటి గురించి అడిగితే గుర్తించడానికి గజానికి 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.. ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చడం తో కొంత సమస్య తీరింది.. ఇంకా ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేశాడు.. వాటి పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..” అని తెలిపారు.
పొరపాటున కూడా పార్టీ మారను.. నేను వైసీపీలోనే ఉంటా
పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైసీపీలోనే ఉంటాను అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంతో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు.. విజయసాయి రెడ్డి రాజీనామా దురదృష్టకరం అన్నారు.. విజయసాయి రెడ్డి పార్టీకి, పార్లమెంట్ లోనూ వెన్నెముక లాంటివారని అభివర్ణించారు.. ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది తెలియదు.. కానీ, మా పార్టీ సభ్యుడిని ఇప్పుడు మళ్లీ రాజ్యసభకు ఎంపిక చేసుకోలేని పరిస్థితి లేదన్నారు.. విజయ సాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. రేయింబవళ్లు పని చేశారు.. ఆయన లేని లోటు తీవ్రమైనది అన్నారు.. అయితే, అధికారం పోయాక పార్టీ నుంచి వెళ్లటం, రావడం కామన్.. కానీ, ఆ జాబితాలో విజయసాయిరెడ్డిని చూడలేం అన్నారు.. ఏదేమైనా పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైసీపీలోనే ఉంటాను అని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్..
భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు.. పలు రంగాల్లో ఇరు దేశాలకు కుదిరిన ఒప్పందాలు
భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుబియాంటో శనివారం భారతదేశానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి, ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈరోజు (శనివారం) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశం అయ్యారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నాల్గవ వ్యక్తి. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ ఇండోనేషియా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా ముఖ్య అతిథి దేశంగా ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు మరోసారి భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం గర్వకారణం. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను భారతదేశానికి స్వాగతిస్తున్నాను అన్నారు.
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు.అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయసాయిరెడ్డి కలలోకి గొడ్డలి వచ్చినట్లుంది.. హోంమంత్రి సెటైర్లు
విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో దావోస్‌లో 4 సార్లు సమ్మిట్ జరిగితే ఒక్కసారి వెళ్ళొచ్చారని వంగలపూడి అనిత ఆరోపించారు. తిరనాళ్ళలో తప్పిపోయిన పిల్లాడి లాగా బిత్తర చూపులు చూస్తూ.. ఇట్స్ లెంగ్త్ క్వషన్ అన్నారని పేర్కొన్నారు. మానసికంగా క్షోభ అనుభవిస్తున్న పిల్లలపై కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం తగదన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తాము అమలు చేస్తే.. వైసీపీ వాళ్ళు ఈ 7 నెలలలో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదని హోంమంత్రి అనిత తెలిపారు.
తెలంగాణలో విశిష్ట సేవా పతకాలు వచ్చింది వీరికే
2025 రిపబ్లిక్ డే సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు సంబంధించిన మొత్తం 942 మంది సిబ్బందిని గ్యాలంట్రీ అవార్డులతో గౌరవించింది. వీరిలో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి గ్యాలంట్రీ పతకాలు, అలాగే 2 మందికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అందజేశారు. గ్యాలంట్రీ అవార్డుల్లో ఎక్కువ భాగం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించిన సిబ్బందికి కేటాయించబడ్డాయి.
విజయసాయి రెడ్డి రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం..
విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. విజయసాయి రెడ్డి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులిటెన్ విడుదల చేశారు. కాగా.. విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ కానుంది. కాగా.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని విజయసాయి రెడ్డి నిన్న (శుక్రవారం) ఎక్స్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను అని నిన్ననే తెలిపారు. తాను ఏ రాజకీయపార్టీలోను చేరడంలేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ రాసుకొచ్చారు. మరోవైపు.. విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. విజయసాయి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మారీ రాజీనామా చేయొద్దని ఎంపీ గురుమూర్తి కోరారు.