2025 ‘సంక్రాంతి’ పర్వదినం పురస్కరించుకొని ప్రారంబమైన ‘స్విస్ ఇండియన్ స్పోర్ట్స్ లీగ్’ ఫిబ్రవరి 15తో ముగిసింది. ప్రారంభ సీజన్లో ‘వరంగల్ వారియర్స్’ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో వరంగల్ వారియర్స్ 6 పరుగుల తేడాతో కాకతీయ నైట్ రైడర్స్‌పై గెలుపొందింది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుల సమక్షంలో ట్రోఫీని ప్రదర్శించారు. వరంగల్ వారియర్స్ నిలకడగా ఆడి 5 లీగ్ గేమ్‌లలో 4 గెలిచి.. లీగ్ పట్టికలో…
Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది.…
ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి…
ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ…
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హౌజింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ బడ్జెట్ సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించండని అధికారులకు తెలిపారు.
కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. రేపటి నుండి 28వ తేదీ వరకు (అంటే 12రోజుల పాటు) రీ సర్వే చేపట్టనుంది. అందుకోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. మరోవైపు.. నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చింది. కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.