తండేల్ పైరసీ.. అరెస్ట్ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తండేల్’. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టడమే కాదు ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై నిర్మాత బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు…
Rythu Bharosa : రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా, ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది.…
CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ని ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం ఆయన చేస్తామని అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం అన్నారు, నిందితుల పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తో కలసి రంగరాజన్ ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి తో…
బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ అతనికి మిథిల సంప్రదాయం ప్రకారం తలపాగా, దుప్పటి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడి ఈ సందర్శనను తనకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. తనకు ఒక రూపాయి నాణెలతో త్రాసుపై తూకం వేశారు.…
ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం కార్యకర్తలు పనిచేశారు.. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలని అన్నారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన నయవంచనను అసెంబ్లీలో, మండలిలో ఎండగట్టామని అన్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను మళ్లీ నిర్వహించాలని కోరామని తెలిపారు.
మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జిపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మార్పులు, చేర్పులు కూడా ఆన్ లైన్ లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీ సేవాలో దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు…
Anil Kumar Yadav : రాజ్యసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మూసీ నది ప్రస్తావించారు. దేశంలోని ముఖ్యమైన నదుల్లో మూసీ నది ఒకటని, గతంలో దీన్ని ముచ్కుందా అనే పేరుతో పిలిచేవారని గుర్తు చేశారు. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉద్భవించి, హైదరాబాద్ నగరాన్ని దాటి నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల గుండా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నది గాఢమైన చరిత్రను కలిగి ఉందని, హైదరాబాద్…