ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడికి భారత్ కారణం.. పాక్ ప్రధాని ఆరోపణలు.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు…
భూముల వేలంలో రికార్డు.. రాయదుర్గంలో గజం ధర రూ.3.40 లక్షలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000…
139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..! జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి…
దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేకంగా, 2019-24 మధ్యలో దేవాలయాలపై జరిగిన దాడులు, వాటిపై తీసుకున్న చర్యలపై…
Chairman’s Desk: ఒకప్పుడు కార్తీక మాసమంటే ఏదో పౌర్ణమి రోజు దీపం పెట్టుకోవడం తప్ప.. ఓ సాదాసీదా పండుగలా గడిచిపోయేది. కానీ భక్తి టీవీ కోటి దీపోత్సవం.. దీపోత్సవం అవసరం, దీపారాధన ప్రాధాన్యం.. సాంస్కృతికంగా, శాస్త్రీయంగా.. వీటికున్న ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లింది. కోటి దీపోత్సవం ప్రభావంతోనే ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి ఇంటా కార్తీక మాసంలో దీపం పెట్టడమనేది తప్పనిసరి ఆచారంగా మారింది. నిజానికి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆచారం ఈరోజు…
CM Revanth Reddy: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు.
భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఈ…
సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..? బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్‌తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్‌బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ….. సినిమా కార్మికులు ఎటు వైపు..? గట్టిగా ప్రభావితం చూపే ఈ వర్గం ఏ పార్టీ వైపు చూస్తోంది? అధికార పార్టీ ఇచ్చిన హామీల్ని నమ్ముతున్నారా? లేక విపక్షాల వైపు చూస్తున్నారా? అసలు ప్రభుత్వం వాళ్ళకు ఏమేం హామీలిచ్చింది? ఆ గ్రూప్ ఓట్ బ్యాంక్ సాలిడ్ అవుతుందా? లేక చీలికలుంటాయా? Also Read:Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..? జూబ్లీహిల్స్ ఉప…
వర్షం కారణంగా రద్దైన ఐదో T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం భారత్- ఆస్ట్రేలియాల మధ్య 5T20 సిరీస్ జరిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు T20 సిరీస్‌లోని ఐదవ, చివరి మ్యాచ్ (నవంబర్ 8) బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఆట ప్రారంభించిన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రా…