తెలంగాణలో మంత్రుల పేరు చెప్పి పేషీల సిబ్బంది సెటిల్ మెంట్స్ చేసేస్తున్నారా? పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పసిగట్టిందా? అందుకే ఎక్స్ట్రా నిఘా పెట్టిందా? ఎక్కడెక్కడ అలాంటి నిఘా కొనసాగుతోంది? ఏ రూపంలో ఉంది? తెలంగాణ సచివాలయంలో ఇప్పుడో సరికొత్త వాతావరణం కనిపిస్తోందట. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం సాధారణమే అయినా… ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఇంటెలిజెన్స్ సిబ్బంది డేగకళ్ళతో దేని కోసమో వెదుకుతున్నట్టు అనిపిస్తోందంటున్నారు. మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల విషయంలో…
Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 18న గ్రూప్-2 ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. మొత్తం 782 మంది అభ్యర్థులు ఈ సందర్భంగా తమ నియామక పత్రాలను స్వీకరించనున్నారు. Pawan Kalyan: పవన్ కల్యాణ్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం…
PCC చీఫ్‌కు ఫిర్యాదు.. క్లారిటీ ఇచ్చిన సీతక్క మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ విషయమై పీసీసీ చీఫ్‌కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో, ఆ వార్తలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. “మేడారం ఆలయ అభివృద్ధి మనందరి…
పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం.. పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రోగి దామావత్ హర్యానాయక్ కు అధికారులు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దావుపల్లి తండాకు వెళ్లిన పల్నాడు డీఎంహెచ్ఓ వెళ్లి, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రేపు సీఆర్డీఏ…
విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహార పథకం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా, ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తమిళనాడు మోడల్‌ను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉదయం అల్పాహార పథకం’ అమలు కానుంది. దీనికి…
టీమిండియాలో విభేదాలు.. గిల్, జైస్వాల్ మధ్య మాటల యుద్ధం టీమిండియా టెస్టు జట్టులో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. డబుల్ సెంచరీ చేసే అవకాశం కళ్ల ముందు చేజారితే ఏ బ్యాటర్‌కైనా కోసం రావడం సహజం. వెస్టిండీస్‌తో రెండో టెస్టు తొలి రోజు అద్భుతంగా ఆడిన యశస్వీ జైస్వాల్ (175) ఈరోజు కూడా మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే, విండీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ, రనౌట్ రూపంలో డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో నాన్…
కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానానికి ఓ మంత్రి పై కొండా మురళీ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఆ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. Also Read:Rain Alert to Telangana…
మీకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా మత్స్యకారులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై ఆయన చర్చించారు. 7193 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ప్రతి కష్టంలో తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. దివిస్, అరబిందో వంటి కంపెనీల నుంచి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెప్తున్న…
జైష్ ఉగ్రసంస్థ కొత్త వ్యూహాం.. అలాంటి ముస్లిం అమ్మాయిలే టార్గెట్! పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ సరికొత్త వ్యూహాం అమలు చేస్తుంది. భావోద్వేగ, మతపరమైన విజ్ఞప్తి ద్వారా సరిహద్దు వెంబడి ఉన్న విద్యావంతులైన ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహం అమలు చేసిందని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇటీవల వెలువడిన ఉర్దూ ప్రచార సామగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలతో పాటు మహిళలను ప్రేరేపించడానికి భావోద్వేగ ప్రసంగాలు ఇస్తున్నారు. రోజువారీ ప్రార్థనలు, దాతృత్వం,…