షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో హత్యారాజకీయం..? అభ్యర్థి అనుమానాస్పద మృతి.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఆవ శేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానస్పద రీతిలో మృతి చెందడం సంచలనంగా మారింది. నాల్గవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆవ శేఖర్ మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే పోలీసులు గ్రామస్థులకు అందించిన సమాచారం ప్రకారం..…
ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు. దీనిని సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ ముందుగా చట్టవిరుద్ధంగా సరిహద్దు…
మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం! భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన…
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టీపీసీసీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక సందేశం పంపిస్తూ పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ వైఖరి పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. “గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ” అని అన్నారు.. నేషనల్…
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మేడారం అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు…
Lionel Messi: అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానుండగా.. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్…
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం…