Kishan Reddy : ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లు, కళాశాలల యాజమాన్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, నిర్లక్ష్య ధోరణిపట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. 14నెలల మీ పాలనలో ఆయా వర్గాలేవీ సంతృప్తిగా లేరనేది నిస్సందేహమని, ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలను సైతం మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వాళ్లకు దక్కాల్సిన…
బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుంది బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు.…
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి.. హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థిపై శారీరక దాడి చేసి అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కలిగించినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు, ఓ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు…
Yadagirigutta: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం వారు అంతరాలయం మాడ వీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులతో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు హాజరయ్యారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. 'తెలంగాణలో సొరంగం పైకప్పు కూలడం నన్ను ఎంతో బాధించింది.. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయని నాకు సమాచారం అందింది.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలో ఉన్నవారిని త్వరగా తిరిగి తీసుకురావడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేస్తుంది' అని రాహుల్ గాంధీ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. సీఎం ముందే వీహెచ్, అంజన్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. వీహెచ్ తన ప్రసంగంలో యాదవుల ప్రస్తావన చేయలేదని అంజన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమను తొక్కేస్తున్నారని అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం..
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
బీసీ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీ నేతలకు ముఖ్యమంత్రి క్లాస్ పీకారు. నేను చేసేది చేసినా.. ఇక మీ ఇష్టం అని నేతలకు సూచించారు. రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి సర్వే.. కర్ర పట్టుకుని కాపాడుకుంటారో లేదో మీ ఇష్టం అని అన్నారు. సర్వే చేసినా నన్ను తిడుతున్నారు.. సర్వేలో కూడా పాల్గొనని వాళ్ళను మంచోడు అంటున్నారని తెలిపారు.