దారుణం.. భార్య, మామ చేతిలో భర్త హత్య..! వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెడ్డిపల్లి వెంకటేష్ (34) అనే యువకుడిని అతని భార్య జయశ్రీ, మామ పండరి కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం… వెంకటేష్ తన భార్య జయశ్రీపై అనుమానంతో తరచూ గొడవపడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సమాచారం. ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో…
జస్టిస్ వర్మను తొలగించాలని ఎంపీలు సంతకాలు.. స్పీకర్కు సమర్పణ నోట్ల కట్ల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట్లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి. అట్టపెట్టెల్లో భారీగా నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫైర్ సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పైఅధికారులకు పంపించారు. ఆ ఫొటోలను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నాకు పంపించారు. దీంతో…
గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.. మమల్ని వేధిస్తున్నారు..! నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం…
“బిట్రా ద్వీపం”లో మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. నేరుగా పాక్, చైనాలపై గురి.. భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా…
CM Revanth Reddy : వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వరాలు కురిపించారు. వరంగల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం, స్పోర్ట్స్ స్కూల్ స్థాపనకు ఆమోదం తెలిపి సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేపూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ అభివృద్ధి అంశాలపై కలిశారు. Indigo Flight: తిరుపతిలో ఇండిగో…
పది సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ పగటికలలు కనడం మానుకోవాలని సూచించారు. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తుందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఏ మీటింగ్ అయినా కేసీఆర్, కేటీఆర్ పేరు ఎత్తకుండా రేవంత్ రెడ్డి మాట్లాడరు అని విమర్శించారు. రాష్ట్రంలో వర్షపాతంపై రివ్యూ…
అక్రమ బంగ్లాదేశీలపై త్రిపుర ఉక్కుపాదం, టాస్క్ఫోర్స్ ఏర్పాటు.. అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా త్రిపుర రాష్ట్రం కూడా…
తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుతోందా? ఇన్నాళ్ళు అణుచుకుని… అణుచుకుని…. ఇప్పుడు సందు చూసుకుని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారా? ఆయన మనసులోని ఆవేదనే ఎక్స్ మెసేజ్ రూపంలో ఎగదన్నుకుని వచ్చేసిందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా ఆవేదన? ఆయన తొందరపడ్డారా? అది వ్యూహమా..వ్యూహాత్మక తప్పిదమా..? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… గడిచిన 18 నెలలుగా… ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పార్టీ నాయకులు. అడపా దడపా సమస్యలు ఉన్నా..నేరుగా అధిష్టానానికో, దూతలకో చెప్పుకుంటున్నారు, పరిష్కరించుకుంటున్నారు…
శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు నేనె సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం…
మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త..! రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న రెండు…