Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ys Jagan And Revanth Reddy Comments

Off The Record: ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా? షర్మిలకు మద్దతుగా రంగంలోకి రేవంత్‌రెడ్డి..!

NTV Telugu Twitter
Published Date :July 9, 2024 , 9:45 pm
By Sudhakar Ravula
  • ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఊహించని ఫలితాలు..
  • ఆంధ్రప్రదేశ్‌లో తెరపైకి కొత్త చర్చలు..!
  • పులివెందుల శాసనసభ సభ్యత్వానికి వైఎస్‌ జగన్‌ రాజీనామా చేస్తారనే ప్రచారం..
  • కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని గుసగుసలు..
  • ఇదే ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిప తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి..
  • జగన్ రాజీనామా చేస్తే కడపలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటన..
Off The Record: ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా? షర్మిలకు మద్దతుగా రంగంలోకి రేవంత్‌రెడ్డి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీకి ఊహించనైనా ఊహించని ఫలితాలు వచ్చాయి. వై నాట్ 175 అని ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పార్టీ.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఆఖరికి ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ప్రతపక్ష నేత హోదా ఇవ్వడానికి ఎమ్మెల్యేల సంఖ్యకు సంబంధం లేదని.. దానితో ముడిపెట్టకుండా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. జగన్‌ లేఖకు తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. మొత్తం అసెంబ్లీ సీట్లలో 10 శాతం సీట్లు గెలవనందున ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కొత్త చర్చలు మొదలయ్యాయి. అందులో ఒకటి.. పులివెందుల శాసనసభ సభ్యత్వానికి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Read Also: Pa Ranjith: ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై డైరెక్టర్ పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు.. డీఎంకేపై తీవ్ర విమర్శలు..

కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి.. అక్కడి నుంచి జగన్ ఎంపీగా పోటీ చేయడం ఇంకొకటి. నాలుగైదు రోజులుగా సోషల్ మీడియా నిండా ఇవే మెసేజ్‌లు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనేలా.. సోషల్ మీడియాలో దీని మీద గట్టిగానే చర్చ జరుగుతోంది. కొంత మంది దీన్ని నమ్ముతుంటే.. ఇంకొందరు వట్టి ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు. పట్టించుకునే వాళ్లు పట్టించుకుంటే.. పట్టించుకోని వాళ్లు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు. సరిగ్గా ఇదే ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. జగన్ రాజీనామా చేస్తే కడపలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీ గల్లీలో తిరిగి ప్రచారం చేస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. సీఎమ్మే ఈ విధంగా అనడంతో.. నిజంగానే జగన్ రాజీనామా చేస్తారా ? ఎంపీగా పోటీ చేస్తారా ? అనే చర్చ మరింత ఊపందుకుంది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అంటే పెద్ద విషయమే. అలాంటి పెద్ద విషయాన్ని రేవంత్ ప్రస్తావించడంతో అది ఇంకా పెద్ద చర్చయింది. 175 మంది ఎమ్మెల్యేలున్న సభలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలున్నారు. జగన్ సాధారణ ఎమ్మెల్యేగా తన టీంతో ఈ కూటమిని ఢీకొనాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేక…ఎమ్మెల్యేల సంఖ్యా ఎక్కువగా లేక ఇబ్బందిపడే కంటే…అసెంబ్లీని వదిలేయడమే ఉత్తమమని జగన్ డిసైడ్ అయ్యారనే వారు పెరిగిపోయారు. మొదట్లో దీన్ని లైట్ తీసుకుంది వైసీపీ. ఎప్పుడైతే రేవంత్ నోట…ఈ మాట వచ్చిందో వైసీపీ కూడా అలెర్ట్ అయ్యింది. ఖండించకుంటే పార్టీ కేడర్ కూడా నిజమేనని అనుకుంటుందేమోనన్న డౌట్ మొదలైంది. ఇదంత అబద్దం అని ఖండించింది. జగన్మోహన్‌రెడ్డి అలా చేయరని వివరణ ఇచ్చింది. కానీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • congress
  • off the record
  • ys jagan
  • YS Sharmila

తాజావార్తలు

  • Bajaj 125cc Bike: బజాజ్ కొత్త 125cc బైక్‌.. విడుదలయ్యేది అప్పుడే!

  • Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్‌..? డబుల్‌ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..

  • Prabhas : ‘కల్కి 2’ అభిమానులకు శుభవార్త చెప్పిన నిర్మాత..!

  • Delhi: ఢిల్లీ సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్.. తప్ప తాగి పెళ్లాంతో గొడవ పడి…

  • Andhra Pradesh: విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై సర్కార్‌ ఫోకస్‌

ట్రెండింగ్‌

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions