నేడు సజ్జల, ఆర్కే, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్. ఇప్పటికే దాఖలైన అన్న పిటిషన్లు కలిపి నేడు విచారిస్తామన్న ఏపీ హైకోర్టు. నేటి నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు అనుమతి. గత నెలలో ప్రమాదాలతో బీచ్‌లో పర్యాటకులకు అనుమతి నిరాకరించిన అధికారులు. నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ బోనాల సందడి. నేడు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పణ. అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక…
ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు. తొలి క్యాబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అని అన్నారు. తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? చురకలు అంటించారు.
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న సిరాజ్.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్…
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించండి.. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని కోరారు.
మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో మొత్తం రూ. 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో.. రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అంతేకాకుండా.. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Pillalamarri: మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులోని ప్రసిద్ధ చెందిన మహావృక్షం మళ్లీ జీవం పోసుకుంది. 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహావృక్షం 2018లో నేలకొరిగి చెదలు పట్టి,..
నేడు సచివాలయంలో ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై ఎస్ఎల్బీసీ తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం విద్యుత్‌శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం…
మరోసారి పతాకధారిగా పీవీ సింధు! భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనున్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలుగమ్మాయి సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను సింధు గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల తరఫున టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాదీ మాజీ షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య…
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో రోజులు గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. అందులో భాగంగానే..