CM Revanth Reddy : నేను ఎవరిపేర్లు ప్రస్తావించలేదు.. వాళ్లు ఎందుకు బాధ పడ్డారు.. రియాక్ట్ అయ్యారు
- సునితక్క కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు అయ్యాయన్న సీఎం రేవంత్
- కానీ అక్క ఆ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ అయ్యారని విమర్శ
- నేను కేసుల చుట్టూ తిరుగుతున్నానని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు. సునితక్క కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు అయ్యాయన్న సీఎం రేవంత్… కానీ అక్క ఆ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ అయ్యారని విమర్శించారు. నేను కేసుల చుట్టూ తిరుగుతున్నానని, నేను ఎవరిపేర్లు ప్రస్తావించలేదు.. వాళ్లు ఎందుకు బాధ పడ్డారు.. రియాక్ట్ అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మన్న అక్క.. నాకు తోడుండాలి కదా. అక్క అనే అన్నా.. వేరే భాషలో మాట్లాడలేదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Lavanya: మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
సభలో హరీష్ 2గంటల11 నిమిషాలు, కేటీఆర్..2 గంటల 36 నిమిషాలు, జగదీష్ 1.10 నిమిషాలు మాట్లాడారని, ఇంతకంటే ఎక్కువ మైక్ ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మా కంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడారని, రాజకీయంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దన్నారు సీఎం రేవంత్. సబితక్క మాట్లాడారు.. తర్వాత నేను మాట్లాడిన అని ఆయన అన్నారు. సబితక్క ఆవేదన మీద కేటీఆర్.. హరీష్ ఎందుకు అండగా లేరని అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్..హరీష్ లు మేము సరిపోతం అంటున్నారని, కేసీఆర్ నీ ఫ్లోర్ లీడర్ గా తీసేయండని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సభ ప్రజా స్వామ్య బద్దంగా ఉందని, చర్చకు సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Adhir Ranjan: కాంగ్రెస్ అవమానిస్తే ఎన్డీయేలో చేరండి.. అధిర్ రంజన్‌కి కేంద్రమంత్రి ఆహ్వానం..
ఇవాళ రాత్రి వరకు బడ్జెట్ కి ఆమోదం కావాలని, .సభలో సస్పెన్షన్ లు ఉండొద్దు అని మా ఆలోచన అని ఆయన అన్నారు. సమయం సందర్భం పట్టి.. సభ్యుల సభ్యత్వం రద్దు కూడా ఉండొచ్చన్నారు. కోమటిరెడ్డి.. సంపత్ ల సభ్యత్వం రద్దు కాలేదా? అని ఆయన వ్యాఖ్యానించారు. నా దగ్గర 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలులు వచ్చి కలిశారు, గద్వాల ఎంఎల్ఏ వాళ్ళ దగ్గరికి వెళ్లి చాయ్ తాగి ఉంటాడు అని ఆయన అన్నారు. 2014లో.. సబితా ఇంద్రారెడ్డికి టికెట్ కూడా ఇవ్వలేదు పార్టీ అని, 2018లో సబితక్కకి టికెట్ ఇవ్వడానికి కారణం ఉత్తమ్ అన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!