నేడు అస్సాం, మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటన. అల్లర్లు చెలరేగిన జిరిబామ్ ప్రాంతాన్ని సందర్శించనున్న రాహుల్. సహాయక శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ. నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విసృతస్థాయి సమావేశం. ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ తొలి సమావేశం. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన భేటీ. పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న బీజేపీ. పాల్గొననున్న కేందరమంత్రులు మురుగన్, శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సోము వీర్రాజు. తెలుగు రాష్ట్రాల్లో…
ఏఐ (AI) కెమెరాలతో భారత సరిహద్దులో నిఘా..చొరబాటుదారుల కట్టడికి యత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది. కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని,…
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి.. అసంపూర్తిగా ఉన్నవి.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్ తో పాటు ఇటు కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగిపోయిన…
రాష్ట్రంలో గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ, పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహింగలేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని హరీష్ రావు అన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం, ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్నారు. అరకొర…
CM Revanth Reddy: ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించామన్నారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని కీలక అంశాలను…
పూణేలో ‘‘జికా వైరస్’’ కలకలం.. 9కి చేరిన కేసుల సంఖ్య.. మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పూణే నగరంలో ఈ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ముగ్గురు గర్భిణిలకు ఈ వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 09కి చేరుకుంది. ఈ విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్లో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ…
కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై పలువురు నేతలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.
హైదరాబాద్ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వానలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాల…
ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కోరాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి…