గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జలసౌధలో కొత్తగా నియమితులైన AEEలకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయం, నీరు అని ఆయన అన్నారు. ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగమని ఆయన అన్నారు. ఇంజనీర్లు, అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంజనీర్లుగా ఈ ఉద్యోగం మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల భావోద్వేగం అని గుర్తుపెట్టుకొని…
సీబీఐకి అనుమతి నిరాకరణ.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య…
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణలో తీసుకోండని, 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలన్నారు కిషన్ రెడ్డి. అక్రమంగా భూములు అమ్మినవారినీ బాధ్యులను చేయాలి, వారి పై చర్యలు తీసుకోవాలని, రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డునపడేస్తే వాళ్ల బతుకులు ఏమై పోతాయన్నారు. పాలకుల,…
ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టండి.. అధికారులకు సర్కార్ ఆదేశం ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సర్కార్ ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేయాలని తెలిపింది. జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ.. ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం పెట్టాలని తెలిపింది. ఇప్పటికే…
తమిళనాడులో భారీ పేలుడు.. తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మూడు లారీల్లో ఒకదానికొకటి వెనువెంటనే మంటలు అడ్డుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పోగా కమ్ముకున్నాయి. గోడౌన్ లో లారీని ఎక్కించే టటువంటి కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరకున్న…
వరద బాధితులకు గుడ్న్యూస్.. 4 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ.. వరద బాధితులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు…
హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీసీని పీసీసీ చేస్తామనీ రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడన్నారు. నా రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదని, జనాభా ప్రతిపాదికన ఎవరి హక్కులు…