తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, సంగెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా, సంగెం - భీమలింగం - ధర్మారెడ్డిపల్లి కెనాల్ - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని రూపొందించారు.
యాదాద్రి పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై యాదాద్రి బదులు అన్ని రికార్డుల్లో యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం ఆదేశం ఇచ్చారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాక్షాత్తు సీఎం తమ ప్రాంతానికి వస్తుండటంతో మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూసీ నదిని శుద్ధి చేసి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కుల గణన, మూసి ప్రక్షాళనపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ భేటీలో చర్చ జరిగింది. మూసి ప్రక్షాళనపై సీఎంతో గవర్నర్ ఆరా తీశారు. పేదలు నష్టపోకుండా చూడాలని.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎంకి గవర్నర్ సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు సీఎం ఆయనకు తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు.
Keshavapuram Reservoir: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
Telangana: కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. నేటి నుంచి ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అంటూ మండిపడ్డారు.