నెల్లూరులో డబుల్ మర్డర్ కలకలం.. పెన్నా బ్యారేజ్‌లో మృతదేహాలు.. వాళ్లిద్దరూ గిరిజనులు.. పెన్నా నది ఒడ్డున నివసిస్తూ.. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు.. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత మార్చారు. కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈడ్చుకుంటూ తీసుకు వచ్చి సమీపంలోని పెన్నా బ్యారేజ్‌లో పడేశారు.. భయాందోళన కలిగించే ఈ ఘటన నెల్లూరులోని పెన్నా బ్యారేజీ సమీపంలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. నెల్లూరులోని రంగనాయకులు పేట సమీపంలో ఉన్న…
హైదరాబాద్‌లో అందాల పోటీలను అందరూ వ్యతిరేకించాలని.. పవిత్రమైన స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దని సీపీఐ నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మేనకోడలకు చెందిన కావేరి ఫుడ్ ప్రొడెక్ట్ షాపును నారాయణ ప్రారంభించి మాట్లాడారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్‌టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్.. హరీశ్‌రావు మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో సగం జనాభా.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జనాభా ఉన్నారని తెలిపారు. సగం జనాభా ఉన్న చోట ఒక్క మంత్రి కూడా లేడన్నారు.
జిల్లాల్లో సీఎం పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లు ఏర్పాటు ఏపీలో జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో సభ్యులుగా ఆరుగురు అధికారులను నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార శాఖ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో అడ్వాన్స్ టీమ్‌లు నియామకమయ్యాయి. అడ్వాన్స్ టీం-1లో వేణుగోపాల్, రాజశేఖర్, రాంబాబు, రమణ, శాంతారావు, సూర్యచంద్రరావులు ఉన్నారు. అడ్వాన్స్ టీం-2లో కృష్ణమూర్తి, శివరాం ప్రసాద్, రాజు, శ్రీనివాసరావు, మల్లిఖార్జున రావు, నాగరాజాలు…
తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లు రూ.2లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8నెలల్లోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో.. 2 లక్షల రూపాయల వరకు రుణామాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం దండగ కాదు..…
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ జూన్ 21న (రేపు) తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే…
జమ్మూ & కాశ్మీర్‌కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంఛార్జిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో – ఇన్‌చార్జ్ లను నియమించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్…
‘‘మనీష్ సిసోడియా అక్కడ ఉండుంటే..’’ స్వాతిమలివాల్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరగడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తను చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, తన కడుపులో, ఛాతిపై తన్నాడని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎన్నికల ముందు ఆప్‌కి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. మొత్తం వ్యవహారమంతా బీజేపీ…