సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే…