కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతూనే ఉంది.. రోజువారా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గినా.. రికవరీలు పెరుగుతున్నా.. ఇంకా అన్ని రాష్ట్రాల్లో అదుపులోకి వచ్చిన పరిస్థితి లేదు.. ఇక, తమిళనాడులోనూ కోవిడ్ కేసులు తగ్గడం లేదు.. దీంతో.. కరోనా కట్టడికోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. గతంలో విధించిన లాక్‌డౌన్ ఈ నెల 24వ తేదీతో ముగియనుండగా.. మే 31 వరకూ పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో.. మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగించినట్టు అయ్యింది.. ఇక, కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామని.. ఆక్సిజన్ సరఫరాలతో పాటు మెరుగైన వసతులను కల్పిస్తున్నామని వెల్లడించారు సీఎం ఎంకే స్టాలిన్.. కరోనా తాజా పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించిన ఆయన.. అనంతరం లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు వెల్లడించారు.