స్టాలిన్ అనూహ్య నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో తిరుగులేని విజయాన్ని అందుకున్న డీఎంకే నేత స్టాలిన్.. సీఎంగా పగ్గాలు చేపట్టారు.. అప్పటి నుంచి పాలన విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.. కోవిడ్‌పై డీఎంకే సర్కార్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తున్నారు. మరోవైపు.. కోవిడ్‌పై పోరాటాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. దీని కోసం తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.. 13 మంది ఎమ్మెల్యేలతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు సీఎం స్టాలిన్… అందులో 12 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే కావడం గమనార్హం.
సీఎం స్టాలిన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (అన్నాడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్ పార్టీ), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలైకుమార్ (ఎండీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), డాక్టర్ జవహారుల్లా (ఎంఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టీ వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ), నాగై మాలి (సీపీఎం) సభ్యులుగా కొనసాగనున్నారు.. అయితే, కోవిడ్‌పై పోరాటంలో సలహా మండలిలో స్టాలిన్ అన్ని పక్షాలను ప్రాతినిథ్యం కల్పించడం.. ప్రతిపక్షాలకు పెద్ద పీట వేయడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఇది కొత్త రాజకీయ ఒరవడి అంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషనలు చేస్తున్నారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!