Vivek Agnihotri: ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
పౌరసత్వ సవరణ చట్టం గురించి మైనారిటీలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)కి సంబంధించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సిని అనుమతించరని సీఎం మమత ప్రకటించారు.
బెంగాల్ లో శాంతి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ కోరారు. తమకు హింస వద్దన్నారు. దేశంలో విభజన వద్దన్నారు. దేశాన్ని విభజించాలని కోరుకుంటున్నవారికి.. ఈద్ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నానని.. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తానని.. కానీ దేశాన్ని విభజన కానివ్వన్నారు.
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
శంఖు ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం చూపరులను ఈ ఆడిటోరియం కట్టిపడేస్తోంది. రూ. 440 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియంలో అనేక విభాగాలు ఉన్నాయి. అద్భుత కట్టడంగా పేర్కొంటున్న ఈ ధన ధాన్య ఆడిటోరియంను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు.
TMC: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ లూయిజిన్హో ఫలేరో తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. టీఎంసీ తన జాతీయ పార్టీ హోదాను కోల్పోయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించిన మరుసటి రోజే ఈ పరిణామం సంభవించింది.
West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
Adenovirus: ప్రపంచదేశాల వెన్నులో వణుకు పుట్టించింది కరోనా మహమ్మారి.. కొత్త కొత్త వేరియంట్లుగా దాడి చేసింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ జలుబు, జ్వరం.. ఇతర సమస్యలు ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. ఇక, పశ్చిమబెంగాల్‌లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైంది బెంగాల్ సర్కార్.. పిల్లలందరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. అనేక…
Mamata Banerjee's Cartoon Case: త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కార్టూన్ ను ఇతరులకు ఫార్వర్డ్ చేసినందుకు జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై క్రిమినల్ కేసు నమోదు అయిన 11 ఏళ్ల తరువాత కోల్కతాలోని అలీపూర్ కోర్టు శుక్రవారం అతడిపై అభియోగాలను కొట్టేసింది.
Mamata Banerjee : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. ఇటీవల తమ పార్టీ ఎంపీ అఖిల్ గిరి రాష్ట్రపతి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.