Telangana Secretariat: సచివాలయంలోకి వెళ్ళే వారికి ఇకపై డిజిటల్ పాస్‌లను ఇవ్వాలని సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు. డిజిటల్ పాసులతో సచివాలయంలోకి అడుగు పెట్టిన వారు.. ఒక శాఖకు చెందిన అధికారులను మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ పాస్ తీసుకొని సచివాలయంలోకి వెళ్ళిన తరువాత గతంలో మాదిరిగా తనకు అవసరం ఉన్న ఇతర శాఖల అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకుంటే.. ఇకపై కుదరదు. సచివాలయంలోకి వెళ్ళాలి అనుకుంటే ఏ శాఖ అధికారులను కలవాలో ముందుగా…
CM KCR: ఈ రోజు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ ఛైర్మన్లకు పిలుపు అందింది.. ఈ సమావేశంలో జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు…
Former: రాష్ట్రంలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది.