తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పదేళ్ల తెలంగాణ వేడుకలను ఎప్పటినుంచి, ఎన్నిరోజులపాటు నిర్వహించాలనే దానిపై అధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు, హైదరాబాద్లో వారం రోజులపాటు ఈ వేడుకలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేడుకలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి?, ఎప్పటి నుంచి నిర్వహించాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read : Special Trains : కాచిగూడ-కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్
అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో వారం రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలనే ఆలోచనలనో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. అమరుల త్యాగాలు స్మరించుకోవడం సహా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా కార్యక్రమాలు ఉండేలా అధికారులు చూస్తున్నారు. సంబంధిత అంశాలపై అన్ని శాఖల కార్యదర్శులతోనూ చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్.
Also Read : BJP: బీజేపీకి గెలుపోటములు కొత్త కాదన్న యెడ్డీ… లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్న బొమ్మై