Madhu Yaskhi Goud Sensational Comments On BRS Party, CM KCR & KTR: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది అయితే.. భోగం మాత్రం బీఆర్ఎస్ పార్టీది అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తాజాగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఆస్తులు పెరిగాయే తప్ప.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల ఆదాయం మాత్రం పెరగలేదని పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో మధుయాష్కీ మాట్లాడుతూ.. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఒక్కసారి గాంధీ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రజాసేవలో భాగంగా ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ సభ్యుడైన రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు.
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ
దేశంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు భాయి భాయి అని.. తెలంగాణలో ఆ రెండూ పార్టీలే ఒకటేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్‌లో ఉన్నా.. అరెస్ట్ చేయలేని స్నేహం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది అని యధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన అమలవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం.. కుటుంబ పాలన కొనసాగుతుందని అన్నారు. అమరుల త్యాగాలను కేసీఆర్ విస్మరించారని, రైతులను రైతు బంధు అంటూ బందిపోటు దొంగలా వ్యవహారిస్తున్న కేసీఆర్‌ను తాము బొందపెడతామని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆధారాలతో రావాలని.. తాము చర్చలకు సిద్ధమని సవాల్ విసిరారు.
Bandi Sanjay: చరిత్ర సృష్టించేలా మోడీ సభని సక్సెస్ చేద్దాం.. ఆ దుష్ప్రచారాల్ని తిప్పికొడదాం
గాడ్సేను పూజించే బీజేపీ పార్టీకి తొత్తుగా మారిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌కు గాంధీజీ గురించి మాట్లాడే హక్కు లేదని మధుయాష్కీ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్‌ల ఆశయాలను సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, నాయకులపై చులకనగా మాట్లాడితే.. చురకలు పెట్టె సమయం కేటీఆర్‌కు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.