CP Ranganath Press Meet Security Arrangements Ahead Of PM Modi Tour: శనివారం (08-07-23) వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో.. భద్రత ఏర్పాట్లపై సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. మోడీ పర్యటన సందర్భంగా తాము మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలకు అదనంగా.. ఇద్దరు ఐజీ స్థాయి, 10 మంది డీసీపీ ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 56 సీఐలు, 250 మంది ఎస్సైలు, 3500 మంది పోలీసులు.. బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నామని.. పబ్లిక్ కమిషన్ ఎగ్జామ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే.. 8 గంటల వరకే పరీక్ష కేంద్రాలకే చేరుకోవాలని సూచించారు. అదాలత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వాహనాలకు అనుమతి లేదన్నారు. మోడీ సభకు వచ్చే కార్యకర్తలు.. 9 నుంచి 9.30 లోపే గ్రౌండ్‌కు చేరుకోవాలన్నారు. ప్రధాని టూర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
60 Snakes: అమ్మ బాబోయ్.. ఏందయ్యా ఇది.. ఆ ఇంట్లో అన్ని పాములు..
ఇదిలావుండగా.. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ రేపు ఉదయం 7:35 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరి, 9:25 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి MI 17 హెలికాప్టర్‌లో బయలుదేరి, మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌కు 10:15 గంటలకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి 10:30 గంటలకు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకొని, 10:45 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి.. 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11:35 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తొలుత వేదికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం ఇస్తారు. అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడాక.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించి, బహిరంగ సభలో మోడీ మాట్లాడుతారు.
Odisha High Court: అలా చేస్తే అత్యాచారం కాదు.. ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు