గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రాజధాని హైదరాబాద్ లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరద ప్రభావం, సహాయక చర్యలు వంటి అంశాలపై అధికారుల ఆయన దిశానిర్దేశం చేశారు.
MLC Kavitha: ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.
MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి(81) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.