ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో పాటు,ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్‌కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. breaking news, latest news, telugu news, big news, errabelli dayakar rao, cm kcr,
Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి ఎంపీగా స్వల్ప తేడాతో ఒడిపోయా అని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
Mallareddy: కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సినిమా చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే సీఎం ఆరోగ్యం మెరుగయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
రాజకీయల్లో గత 40 ఏళ్లుగా అభివృద్ధి ద్యేయంగా పని చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్ లో కూడా అదే పని విధానము ఉంటుంది అని ఆయన తెలిపారు. ఒక నాయకుడు పార్టీలోకి వస్తుంటే కొందరు ఇబ్బంది పడతారు.. కానీ నన్ను క్రింది స్థాయి నుంచి అందరూ స్వాగతించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలకు చేరే విధంగా మేము పోరాటం చేస్తున్నాం.. దోచుకోవడం కోసం కొందరు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి కానీ, తెలంగాణలో అది లేదు.. అధికారంలోకి వచ్చి డబ్బు, మద్యం, అధికారం అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారు అంటూ భట్టి విక్రమార్క అన్నారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చే ముందు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని డిమాండ్ చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్ లో పసుపు బోర్డు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాలి అని కవిత అన్నారు.
Minister KTR: హైదరాబాద్ నగరవాసులకు హెచ్‌ఎండీఏ శుభవార్త చెప్పింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా.. మంత్రి కెటి రామారావు నేతృత్వంలో ఎంఎయుడిఆర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.