Errabelli Dayakar Rao : గిరిజనులకు, గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ దే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో పాటు,ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్‌కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లాను ఇచ్చారు.. ఈరోజు జిల్లాకు మెడికల్ కాలేజీ ని మంజూరు చేసారన్నారు. 1100 మంది దళిత బంధు ఇస్తున్నాం, 3000 మందికి గృహలక్షి పథకంతో పాటు 5000 మందికి ప్రత్యక్ష్యంగా లబ్ది చేకూరుతుందన్నారు. ఏటూరునాగారం లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, 7800 కుటుంబాలకి 14000 పట్టాలి ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు.
Also Read : Viral Video: ఇదేం పిచ్చి రా బాబు.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో..
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
ఈ ప్రాతంలో గిరిజన తండాలకు, గూడాలకు 350 కోట్ల వెచ్చించి కరెంట్ ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, దివంగత జడ్పీ చైర్మన్ జగదీష్ కోరిక మేరకు మల్లంపల్లి మండలం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ములుగు జిల్లాలో 100కోట్ల రూపాయలతో గిరిజన తండాలకు,గూడాలకు రోడ్లు నిర్మాణం చేపట్టామని ఆమె అన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గిరిజనులకు, గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు. మేడారం జాతర ను అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. రెండువేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. పేదల కోసమే పనిచేసిన ముఖ్య మంత్రులు ఇద్దరే ఇద్దరు.. ఒకటి ఎన్టీఆర్, ఇంకొకరు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు.
Also Read : Telangana Elections : తెలంగాణ హైటెక్ ప్రచారానికి సిద్ధమవుతున్న వాహనాలు..
తాజావార్తలు
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!