సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్…
ఇటీవలే ఢిల్లీలో పర్యటించి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. తర్వాత జరిగే BAC సమావేశంలో అసెంబ్లీ సెషన్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ…
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా 9 మంది మాజీ శాసన సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే BAC సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి అసెంబ్లీ సెషన్స్ వారం పాటు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… నెల రోజుల పాటు నిర్వహించాలని…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. హస్తినలో టీఆర్‌ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి…
తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి.…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను వారానికి పైగా నిర్వహించాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. బీఏపీ సమావేశంలో చర్చించి… ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న మొదలై.. 26న ముగిశాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దళితబంధు పథకం కోసం కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి…ఆమోదించుకోవాలని భావిస్తోంది.…
ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన తర్వాత.. సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక ఆడ, ఒక మగ అధికారులతో కమిటీ ఉంటుందని.. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించి…
ప్రజా సంగ్రామ యాత్రలో అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచితే మెడలు వంచుతాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. మంచి జరిగితే రాష్ట్రం, చెడు జరిగితే కేంద్రంది అంటారంటూ ఫైర్ అయిన ఆయన.. లీటర్ పెట్రోల్‌పై రూ.26 వ్యాట్ , రూ. 14 టాక్స్ తీసుకుంటున్నారని.. మళ్లీ…
హుజూరాబాద్ ఉప ఎన్నిక వీలైనంత ఆలస్యంగా జరగాలని టీఆర్‌ఎస్ కోరుకుంటోంది. మరోవైపు, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఈ ఎన్నికలు వీలైనంత తొందరగా జరగాలని కోరుకుంటోంది. అవి ఎందుకు అలా బావిస్తున్నాయనటానికి స్పష్టమైన కారణాలున్నాయి. ఉప ఎన్నిక ఆలస్యమైతే ఉచిత పథకాలు ..స్కీములు ఎక్కువ మంది ఓటర్లకు చేరుతాయి. ఇది టీఆర్‌ఎస్ ఆలోచన. ఈటలకు ఉన్న సింపథీ ఫ్యాక్టర్ చల్లారుతుంది. ఇది బీజేపీ భయం. అలా జరగకముందే వీలైనంత త్వరగా ఎన్నికలు జరిగేలా చూడటానికి బీజేపీ తన…