నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా 9 మంది మాజీ శాసన సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే BAC సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి అసెంబ్లీ సెషన్స్ వారం పాటు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… నెల రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఐదుకు పైగా బిల్లులను ఆమోదింప జేయాలనే ఆలోచనతో ఉంది KCR ప్రభుత్వం. ఇందులో దళిత బంధుకు సంబంధించిన చట్టం కూడా ఉంటుందని తెలుస్తోంది. అటు విపక్షాలు కూడా దళితబంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తామంటోంది కాంగ్రెస్.
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
అలాగే, వివిధ ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాలంటోంది. ఆసరా పెన్షన్స్ పంపిణీలో జాప్యంపై గళమెత్తాలని నిర్ణయించింది బీజేపీ. దళిత బంధు పథకం అమలు తీరు, నిరుద్యోగ భృతితో పాటు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ అంశంతో పాటు ఉద్యోగ నియామకాలపైనా TRS ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి విపక్ష పార్టీలు. దీంతో తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!