హైటెక్ లో ‘గులాబీ’ ధగధగలు.. ప్లీనరీకి సర్వం సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపేలా ఆపార్టీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగబోతున్నాయి. కరోనా, ఇతరత్రా కారణాలతో గడిచిన మూడేళ్లుగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగలేదు. ఆ లోటును భర్తీ చేసేలా ఈసారి ప్లీనరీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. దీనిలో భాగంగానే భాగ్యనగరం గులాబీ మయంగా మారుతోంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక ‘పింక్’ రంగు పులుముకుందా? అన్నట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది. దీంతో ఆపార్టీ శ్రేణులు, నేతల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొందనే టాక్ విన్పిస్తోంది.
టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 25న ప్లీనరీ వేడుకలు జరుగున్నాయి. హైదరాబాద్లోని హైటెక్ వేదికగా జరిగే ఈ ప్లీనరీ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతోపాటు దాదాపు 6వేల మంది హాజరు కానున్నారు. ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీకి వచ్చే టీఆర్ఎస్ నేతలంతా గులాబీ దుస్తులను ధరించి రావాలని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా కోరడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ ప్లీనరీ సమావేశాల్లో ఆపార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
టీఆర్ఎస్ అధ్యక్ష పదవీకి గతంలో మాదిరిగానే ఈసారి ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. దీంతో పదోసారి కూడా కేసీఆరే ఆపార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనంగా కన్పిస్తోంది. ఇక ప్లీనరీలో ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ రోడ్లన్నీ కేసీఆర్ కటౌట్లు, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించే ప్లెక్సీలతో దర్శనమిస్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా 20మీటర్ల వెడల్పు కాన్వాస్‌పై ఇరవై ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలను గీయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా కోట గుమ్మాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల థీమ్‌లతో ఎల్‌ఈడీ ధగధగలు, కళ్లకు కట్టినట్లు చూపేలా వేలాది ఫొటోలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను చూపించనున్నారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ప్లీనరీకి వచ్చేవారి కోసం ఆకట్టుకునే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యే ఆరువేల మంది కోసం దాదాపు 29 రకాల ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయనున్నారని సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ ఏర్పాట్లు చూస్తుంటే యావత్ భాగ్యనగరం గులాబీమయంగా మారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!